‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

by Sathputhe Rajesh |   (  Updated:2024-07-20 15:27:30  IST  )

‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు.

‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులకు ఆర్థిక సాయానికి కొత్త పథకం దోహదపడనుంది. సింగరేణి ద్వారా ఆర్థిక సాయం అందించే పథకాన్ని కాంగ్రెస్ సర్కారు నేడు ప్రారంభించింది. ప్రజాభవన్‌లో ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సివిల్స్, ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి, జూపల్లి, తుమ్మల, కోమటిరెడ్డి, సీఎస్ శాంతి కుమారి, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, సింగరేణి సీఎండీ బలరాం పాల్గొన్నారు.

Read More..

DSP Transfer : చర్చనీయాంశంగా మెదక్ డీఎస్పీ రాజేశ్వర్ బదిలీ

Next Story