- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: HYD మెట్రో స్వాధీనంపై సీఎం రేవంత్ తీర్మానం.. హరీష్ రావు నిరసన
ఎల్ అండ్ టీ సంస్థ నుంచి హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మెట్రోపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి.. ఈ ఏకగ్రీవ తీర్మానానికి సభ్యులంతా ఆమోదం తెలపాలని కోరారు. మెట్రో విస్తరణకు ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగానే స్వాధీన ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ప్రజా రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగు పరిచి, మెట్రో నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కావలసిన ప్రణాళికలను రచించామన్నారు. అనంతరం మెట్రో స్వాధీనాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
అనంతరం.. మెట్రోపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు నిరసన తెలిపారు. ఇది ఏకగ్రీవ తీర్మానం కాదని, ఏకపక్ష తీర్మానమని విమర్శించారు. బీఆర్ఎస్ సభ్యుల అభిప్రాయం తీసుకోకాకుండా ఏకగ్రీవంగా బిల్లును ఎలా పాస్ చేస్తారని ప్రశ్నించారు. శాసనసభ నడిపే వ్యవహారం, పద్ధతి ఇది కాదన్నారు. ప్రకటన చేసే హక్కు ఉంది కానీ.. దానిపై ఎలాంటి చర్చ జరపకుండా సభ్యులంతా ఆమోదించినందుకు ధన్యవాదాలు అని ఎలా చెప్తారని ఫైరయ్యారు. దీనిపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర నిరసన తెలుపుతున్నారన్నారు.






