CM Revanth Reddy: అది ప్రొసీజర్‌లో భాగమే.. ఎమ్మెల్యేలకు నోటీసులపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-04 08:15:06  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన అసెంబ్లీ హాలు (Assembly Hall)లో జరిగిన కేబినెట్ భేటీ (Cabinet Meeting) కాసేపటి క్రితం ముగిసింది.

CM Revanth Reddy: అది ప్రొసీజర్‌లో భాగమే.. ఎమ్మెల్యేలకు నోటీసులపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన అసెంబ్లీ హాలు (Assembly Hall)లో జరిగిన కేబినెట్ భేటీ (Cabinet Meeting) కాసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా కుల గణన (Cast Census), ఎస్సీ వర్గీకరణ (Classification Of SC) నివేదికపై సుధీర్ఘంగా చర్చ కొనసాగింది. సమావేశం అనంతరం సీఎం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. కులగణన చేసి చరిత్ర సృష్టించామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి మూలన పకడ్బందీగా సర్వే చేసి సమగ్రంగా సమాచారాన్ని సేకరించామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన సాహసాన్ని చూసి కులగణన జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi)పై కూడా ఒత్తిడి వస్తుందని అన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ అందించామని కామెంట్ చేశారు.

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఎలాంటి బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని అన్నారు. అసలు తాము బీఆర్ఎస్ పార్టీ (BRS Party)ని పరిగణలోకి తీసుకోవడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు నివేదికలపై చర్చకు ప్రతిపక్ష నేతల రావాలి కదా.. అని సెటైర్లు వేశారు. బీసీ రిజర్వేషన్ల (BC Reservations)పై కోర్టు ఆదేశాలతో కమిషన్ వేశామని అన్నారు. వారిచ్చిన ఆదేశాల మేరకు కమిషన్ నిర్ణయం తసుకుందని స్పష్టం చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ముందుకు వెళ్తామని అన్నారు. వర్గీకరణపై మంత్రి వర్గ ఉప సంఘం, ఏక సభ్య కమిషన్ సిఫార్సల మేరకు నడుచుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఎప్పటి వరకు అది ఎక్కడుందో తమకు తెలియదని అన్నారు. అదేవిధంగా ఫిరాయింపు ఎమ్మల్యేల విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలు మేరకు అసెంబ్లీ కార్యదర్శి వారికి నోటీసులు ఇవ్వడం ప్రోసీజర్‌లో భాగమేనని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు.

Next Story