నిర్లక్ష్యం వద్దు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి హెచ్చరిక

by Prasad Jukanti |   (  Updated:2026-03-16 14:44:39  IST  )

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యే విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని సీఎం హెచ్చరించారు.

నిర్లక్ష్యం వద్దు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం అయిపోయిందని ఇక మన భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై దృష్టిసారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వంలో మూడవ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని గవర్నర్ ప్రసంగం మన ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిదన్నారు.ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి గవర్నర్ ప్రసంగంలో వివరించారని చెప్పారు. శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్‍లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని సీఎల్పీ అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన సభ్యులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

నిర్లక్ష్యం వద్దు:

సభలో మాట్లాడే అంశాలపై విప్‍ల మధ్య సమన్వయం ఉండాలని సభలో చర్చ పక్కదారి పట్టకుండా, సభా సమయం వృధా కాకుండా సమర్థవంతంగా నడిపేలా చూడాలని సీఎం సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు సబ్జెక్ట్ మాట్లాడటానికి కూడా సమయం ఇవ్వలేదని సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్కకు, జానారెడ్డికి కూడా మైక్ ఇవ్వలేదని, సెషన్ మొత్తం సస్పెండ్ చేసి ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు నన్ను సభకు రాకుండా చేశారని గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల హాజరు విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు. మహిళా శాసన సభ్యులు హాజరుతో పాటు చర్చల్లో పాల్గొనాలని సభా చర్చల్లో మహిళా సభ్యుల భాగస్వామ్యం అవసరం అని సీఎం చెప్పారు.

రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండదు:

అసెంబ్లీ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని సీఎం తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాలు పర్యటించి సమస్యలు, ఆయా ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేయాలన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండదని ఆది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుందని తెలిపారు. వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుందని పార్టీ, ప్రభుత్వ పరమైన లైన్‍లోనే అందరూ స్పందించాలన్నారు. ఇది మన ప్రభుత్వం ఇప్పుడు మనం వేసుకునే రోడ్ మ్యాప్‍నే వచ్చే ఎన్నికలకు ఎజెండా అవుతుందన్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యపై సభ్యులు ఫోకస్ పెట్టాలని, 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందేనని ఆదేశించారు.

CM Revanth: నందిని సిధారెడ్డి గొప్ప మానవతావాది

Next Story