- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీ సమావేశాలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
ప్రజెంటేషన్ జరుగుతున్న సమయంలో సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సరైన సంఖ్యలో లేకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్ జరుగుతున్న సమయంలో సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సరైన సంఖ్యలో లేకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్స్..
ప్రజెంటేషన్ సమయంలో కొందరు ఎమ్మెల్యేలు సభలో లేకుండా లాబీల్లో తిరగడాన్ని సీఎం తీవ్రంగా తప్పుపట్టారు. ఇది మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించిన సీఎం, వెంటనే అందరినీ సభలోకి పిలిపించాలని విప్‌లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సీఎం సలహాదారులు ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్స్ చేసి సభలోకి రావాలని సూచించారు. ఆ తరువాత ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు హాల్‌లోకి చేరుకున్నారు. శాసనసభ కార్యకలాపాల పట్ల సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సూచించినట్లు సమాచారం.






