CM Revanth Reddy : హోంగార్డ్స్ కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

by M.Rajitha |   ( Updated:2024-12-06 14:16:09.0  )
CM Revanth Reddy : హోంగార్డ్స్ కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా జరుపుతున్న ప్రజా పాలన విజయోత్సవాల్లో(Triumph of public governance) శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) పాల్గొన్నారు. నేడు తెలంగాణ పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. పోలీసుశాఖలో కీలక పాత్ర పోషించే హోంగార్డ్స్(Home Guards) కు సీఎం శుభవార్త వినిపించారు. ప్రస్తుతం వారికి ఇస్తున్న రోజు వారి జీతం రూ.920 నుంచి 1000 కి పెంచుతున్నట్టు ప్రకటించారు. అలాగే వీక్లీ పరేడ్ అలవెన్స్ ను రూ. 100 నుంచి రూ. 200 కు పెంచుతున్నామని వెల్లడించారు. విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం జరిగి హోంగార్డ్స్ మరణిస్తే వారి కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని పేర్కొన్నారు. హోం గార్డ్స్ కు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి వైద్య సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేశారు. ప్రమాదంలో మరణించిన ఐపీఎస్ కుటుంబానికి రూ.2 కోట్ల ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు. ఇవన్నీ జనవరి 1 వరకు అమలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. పోలీసు కుటుంబాల పిల్లలకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్(Young India Police School) ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేశామని అన్నారు. పోలీస్ సిబ్బంది పిల్లలకు ఈ స్కూల్ లో 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు సైనిక్ స్కూల్, డిఫెన్స్ స్కూల్స్ వంటి ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉచిత విద్య అందిస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed