CM Revanth Reddy: హిరోషిమాలో బిజీ బిజీగా రేవంత్‌రెడ్డి

by Prasad Jukanti |

జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు.

CM Revanth Reddy:  హిరోషిమాలో బిజీ బిజీగా రేవంత్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy Japan Tour) నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం ఇవాళ హిరోషిమా (Hiroshima city ) నగరంలో పర్యటించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి జాతిపిత, శాంతిదూత మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అలాగే షిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్, అటామిక్ బాంబ్ డోమ్‌ను సందర్శించారు. పార్క్‌లో ఏర్పాటు చేసిన రెండవ ప్రపంచ యుద్ధంలో అణు బాంబు దాడిలో మరణించిన వారికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు.

Next Story