- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్.. టీ కాంగ్రెస్‍లో ఉత్కంఠ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్‍గా మారింది. ఇవాళ ఉదయం మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి అనంతరం నేరుగా ఢిల్లీకి పయనమయ్యారు. హస్తినా చేరుకున్న ఆయన అక్కడ బిజీ బిజీగా గపడపోతున్నారు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కాబోతున్నట్లు సమాచారం. రేపు రైల్వే, ఎరువులు-రసాయననాలు, జలవనరుల శాఖ మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అధిష్టానంతో భేటీపై స్టేట్‍లో ఉత్కంఠ:
ఢిల్లీ పర్యటలో (Delhi Toure) భాగంగా రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలతో భేటీ కానుండటం రాష్ట్ర కాంగ్రెస్‍లో ఆసక్తి రేపుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం, పార్టీలోని తాజా పరిణామాలను సీఎం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి కావడంతో పాటు కేబినెట్‍లో మరో బెర్త్ ఖాళీగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో సరైన రీతిలో పని చేయని మంత్రులపై చర్యలు తప్పవని సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చారనే టాక్ ఇటీవల పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించింది. ఈ నేపథ్యంలో మంత్రి విస్తరణ మరోసారి ఉండబోతోందా? ప్రస్తుత మంత్రుల పనితీరు ఆధారంగా కేబినెట్‍లో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా అనేది ఉత్కంఠగా మారింది.
మూసీ ప్రాజెక్టుకు నిధులు!:
రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నది పరివాహక ప్రాంతాల అభివృద్ధికి కోసం ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకు సంబంధించి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను సైతం జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి నిధులు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యలపై కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే చాన్స్ కనిపిస్తోంది.






