ఒక్కరిని కూడా వదలొద్దు.. కాళోజీ వర్సిటీ ఇష్యూపై CM రేవంత్ ఫైర్

by Gantepaka Srikanth |

ఒక్కరిని కూడా వదలొద్దు.. కాళోజీ వర్సిటీ ఇష్యూపై CM రేవంత్ ఫైర్

ఒక్కరిని కూడా వదలొద్దు.. కాళోజీ వర్సిటీ ఇష్యూపై CM రేవంత్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై పత్రికల్లో వస్తున్న కథనాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు, ఇష్టారీతిగా ఇన్‌చార్జీల నియామకం తదితర ఘటనలపై వస్తున్న ఆరోపణలపై సీఎం ఆరా తీశారు. ఈ అంశంపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి సీఎం వివరణ కోరారు. ఉన్నతమైన వర్సిటీలో అస్తవ్యస్థ పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఘటనల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించే సమస్యే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి సంస్థల్లో పని చేసేవారు సమర్థంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పని చేయాలని సీఎం సూచించారు. కాగా, వైద్య విద్య పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాలు, సీట్ల కేటాయింపు వరకు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇదే ఇష్యూపై నిన్న గవర్నర్‌కు బీఆర్ఎస్ నేత హరీష్ రావు లేఖ రాసిన విషయం తెలిసిందే.

Next Story