- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెస్సీ కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక గాంధీని ఆహ్వానించా: సీఎం రేవంత్
ఈనెల 13వ తేదీన ఉప్పల్ స్టేడియంలో ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఈనెల 13వ తేదీన ఉప్పల్ స్టేడియంలో ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కార్యక్రమానికి (Lionel Messi India Tour 2025) రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. 13వ ఓ ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మెస్సీ హాజరు అవుతున్నారని తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నన్ను కూడా ఆ సంస్థ ఒక అతిథిగా పిలించిందన్నారు. ప్రముఖ క్రీడాకారుడు వస్తున్నందున ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఇస్తున్నామన్నారు. ఇవాళ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరే ముందు పార్లమెంట్ ఆవరణంలో సీఎం మీడియాతో మాట్లాడారు. మెస్సీ గోడ్ ఇండియా టూర్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్లు తెలిపారు. ఢిల్లీలో కలిసిన అందరినీ ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించానని చెప్పారు. గోడ్ ఇండియా టూర్ 2025 పేరుతో అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ మూడు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు. ఈ నెల 13,14,15 తేదీలలో కోల్ కతా, హైదరాబాద్, ముంబయి, న్యూఢిల్లీ నగరాల్లో పర్యటించబోతున్నారు. ఇందులో భాగంగా 13న కోల్ కతా పర్యటన ముగించుకుని మెస్సీ హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ ఫుట్ బాలు మ్యాచ్ ఆడనున్నారు. మెస్సీ పర్యటన, ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.






