రావి నారాయణరెడ్డి స్మారక జాతీయ అవార్డులు.. సీఎంకు ఆహ్వానం

by Ramesh Naini |

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, నల్లగొండ లోక్ మాజీ సభ్యుడు రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి రావాలని తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది.

రావి నారాయణరెడ్డి స్మారక జాతీయ అవార్డులు.. సీఎంకు ఆహ్వానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, నల్లగొండ లోక్ మాజీ సభ్యుడు రావి నారాయణరెడ్డి స్మారక జాతీయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి రావాలని తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది. ఈ మేరకు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు చాడ వెంకటరెడ్డి, కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్ రెడ్డి, సభ్యులు రావి భారతి, కె.శ్రీనివాస్ రెడ్డి తదితరులు మంగళవారం శాసనసభ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఒక లేఖను అందజేశారు.

టిమ్స్‌కు రావి నారాయణరెడ్డి పేరు పెట్టాలి

రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డును ఈ ఏడాది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని ట్రస్ట్ నిర్ణయించిందని ట్రస్ట్ అధ్యక్షుడు చాడ వెంకట రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. నిరంకుశ నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించేందుకు సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వారిలో ఒకరైన రావి నారాయణ రెడ్డి పోరాట స్ఫూర్తిని తరతరాలు స్మరించుకునే విధంగా ఆయన విగ్రహాన్ని ఎల్బీ నగర్‌లో ఏర్పాటు చేయాలని, ఎల్బీ నగర్ (కొత్తపేట)లో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)కు రావి నారాయణ రెడ్డి పేరు పెట్టాలని కందిమళ్ల ప్రతాప్ రెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ రావి నారాయణ రెడ్డి అవార్డు ప్రదానోత్సవానికి వస్తానని చెప్పినట్లు చాడ వెంకటరెడ్డి తెలిపారు.

Next Story