సీఎం కప్‌ ప్రారంభ కార్యక్రమానికి రావాలని సీఎంకు ఆహ్వానం

by Gantepaka Srikanth |

బ్రవరి 20న గచ్చిబౌలి స్టేడియంలో జరుగనున్న సీఎం కప్‌-2026కు హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్ శివాసేనరెడ్డి ఆహ్వానించారు.

సీఎం కప్‌ ప్రారంభ కార్యక్రమానికి రావాలని సీఎంకు ఆహ్వానం
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిబ్రవరి 20న గచ్చిబౌలి స్టేడియంలో జరుగనున్న సీఎం కప్‌-2026కు హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్ శివాసేనరెడ్డి ఆహ్వానించారు. పల్లె నుంచి పట్నం వరకు విద్యార్థుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని గుర్తించేందుకే సీఎం కప్‌ నిర్వహించినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలియజేశారు. విద్యార్థులు, యువతీ, యువకులు సీఎం కప్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మొత్తం 44 రకాల క్రీడలను సీఎం కప్‌లో భాగంగా పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల పోటీతత్వంతో శారీరక దృఢత్వం మెరుగుపడుతుందని మంత్రి వాకిటి శ్రీహరి అభిప్రాయపడ్డారు. సీఎం కప్‌ను పాఠశాల విద్యనుంచి యూనివర్శిటీ స్థాయి విద్యార్థుల వరకు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు.

Next Story