- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: మెడకు కంటె, గుండుపూసల హారం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఎమోషనల్ కామెంట్స్
డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పర్వదినమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పర్వదినమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల (Telangana Assembly Sessions) సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ.. 2009 సరిగ్గా ఇదే రోజుల తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన వచ్చిందని అన్నారు. తెలంగాణ (Telangana) ప్రజల ఆకాంక్షలకు పునాది రాయి పడిన రోజు అని తెలిపారు. అదేవిధంగా సోనియాగాంధీ (Sonia Gandhi) 78వ జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సోనియా నెరవేర్చాని పేర్కొన్నారు. ఉద్యమంలో సబ్బండ వర్గాలను నడిపించిన మూర్తి తెలంగాణ తల్లి (Telangana Thalli) అని అన్నారు.
నిరంతరం చైతన్యపరిచి లక్ష్య సాధన వైపు నడిపిన స్ఫూర్తి తెలంగాణ తల్లిదేనని తెలిపారు. తెలంగాణ తల్లి రూపంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక గుర్తింపు లేదని.. నిండైన రూపాన్ని తీర్చిదిద్ది సచివాలయంలో ఆవిష్కరిస్తున్నామని అన్నారు. మెడకు కంటె, గుండపూసల హారం, చెవులకు బుట్ట కమ్మలు, ముక్కుపుడక, బంగారు అంచుతో కూడిన చీరతో చాకలి ఐలమ్మ (Chakali Ailamma), సమ్మక్క-సారలమ్మ (Sammakka - Saralamma) స్ఫూర్తితో తెలంగాణ తల్లి రూపం ఉందని సీఎం పేర్కొన్నారు. కుడి చేతితో జాతికి అభయమిస్తూ.. ఎడమ చేతిలో తెలంగాణ (Telangana)లో పండే పంటలతో తల్లి దర్శనమిస్తుందని తెలిపారు. ఉద్యమాలు, ఆత్మ బలిదానాలకు సంకేతంగా పీఠంలో పిడికిళ్లను పొందుపరిచామని, తెలంగాణ తల్లి నిల్చున్న పీఠం చరిత్రకు దర్పణమని అన్నారు. చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పున: నిర్మాణాన్ని తెలుపుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.






