- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పునరుద్ధరించిన శాసన మండలి భవనం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
అసెంబ్లీలో ఆధునిక హంగులతో పునరుద్ధరించిన శాసనమండలిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఆధునీకరించిన శాసనమండలిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. శాసనమండలిని అత్యాధునిక హంగులతో పునర్నిర్మించగా.. మేళ తాళాల మధ్య సీఎం రేవంత్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం మండలిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మండలి చైర్మన్, మంత్రులతో కలిసి మండలిలో కూర్చుని కొద్దిసేపు ముచ్చటించారు. మండలి చైర్మన్, మంత్రులతో కలిసి మండలిలో కూర్చుని కొద్దిసేపు ముచ్చటించారు. వారసత్వ సంపదకు చిహ్నమైన తెలంగాణ పాత అసెంబ్లీ హాలును కొత్త హంగులతో ముస్తాబు చేశారు.
మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు కుటుంబానికి ఆధారం, సమాజానికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. అలాగే మహిళల శక్తి, సహనం, ప్రేమ, త్యాగం అపూర్వమైనవని కితాబిచ్చారు. ఆడబిడ్డల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. సచివాలయం నడిబొడ్డున కొలువైన తెలంగాణ తల్లి నుంచి పల్లెపల్లెలో ఉన్న అవ్వలు, అక్కలు, చెల్లెళ్లు, ఆడబిడ్డలంతా ప్రజాపాలనలో ఆత్మగౌరవ ప్రతీకలేనని పేర్కొన్నారు.






