ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట : సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి నేడు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. కొత్తగూడెంలో డా.మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీ ప్రారంభించారు. ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టుకోవడం గర్వకారణం అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో ఖమ్మం జిల్లాకు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఖమ్మం జిల్లా మంత్రులు ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని ప్రతీ లబ్ధిదారుని వద్దకు తీసుకు వెళ్తున్నారని అన్నారు. ప్రతీ సంక్షేమ పథకం ఖమ్మం నుంచే ప్రారంభించామని గుర్తు చేసారు. 1969లో మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం ఖమ్మం నుంచే మొదలైందని, రాష్ట్ర సాధనకు మొదటి అడుగులు ఇక్కడి నుంచే పడ్డాయని పేర్కొన్నారు.

మంచి మంత్రులు ఉంటె సరిపోదని, మంచి సర్పంచులు కూడా ఉంటేనే ప్రభుత్వ పథకాలు అందరికీ చేరుతాయని.. కాబట్టి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మరో పదేళ్లు రాష్ట్రాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా సస్యశామలం చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి గ్రామంలో ఎగరాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story