CM Revanth Reddy: కులగణనపై బీజేపీకి షాకిచ్చేలా రేవంత్ రెడ్డి భారీ ప్లాన్.. వారితో నేడు కీలక భేటీ!

by Prasad Jukanti |

బీజేపీకి షాకిచ్చేలా కులగణనపై రేవంత్ రెడ్డి భారీ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

CM Revanth Reddy: కులగణనపై బీజేపీకి షాకిచ్చేలా రేవంత్ రెడ్డి భారీ ప్లాన్..   వారితో నేడు కీలక భేటీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీలో (Delhi Tour) పర్యటిస్తున్నారు. నిన్న సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ పార్టీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. తెలంగాణలో కులగణనపై భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కేంద్ర ప్రభుత్వం రాబోయే జనగణనలో కులగణన (Caste Census) నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో నిన్న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో నేతలు క్యాస్ట్ సెన్సస్ అంశంపై చర్చించారు. అయితే తెలంగాణలో ఇప్పటికే కులగణన చేపట్టి ఆ వివరాల ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు బిల్లలను సైతం అసెంబ్లీ ఆమోదించింది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ మోడల్ ను దేశం అనుసరిస్తోందని కాంగ్రెస్ పార్టీ క్లయిమ్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో భారీ బహిరంగ సభను నిర్వహించి తెలంగాణలో తాము అనుసరించిన విధానం, తమ డిమాండ్ వల్లే కేంద్ర ప్రభుత్వం కులగణనకు సిద్ధమైంది అనే సందేశాన్ని దేశానికి పంపేలా సభ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సభ ఎక్కడ ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై ఇవాళ ప్రధానంగా పార్టీ పెద్దలతో సీఎం చర్చిస్తారనే టాక్ వినిపిస్తోంది.

మంత్రివర్గ విస్తరణపై డిస్కషన్!:

గత ప్రభుత్వ లోటుపాట్లను గాడిలో పెట్టేందుకు తమకు ఇంతకాలం పట్టిందని ఇకపై పరిపాలనపై మరింత దృష్టి సారిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే భారీ స్థాయిలో అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక త్వరలోనే మంత్రివర్గ విస్తరణనపై సీఎం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దాదాపు ఖాయం అనుకున్న మంత్రి వర్గ విస్తరణ గత నెలలో వాయిదా పడింది. ఈ విషయంలో తెరపైకి కొత్త కొత్త డిమాండ్లు వస్తున్నాయి. అయితే ఈ అంశాన్ని ఇక నాన్చకూడదనే డిమాండ్లు పార్టీలో బలంగా వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని ఇవాళ జరిగే భేటీలో పార్టీ పెద్దలతో సీఎం చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఆపరేషన్ కగార్ ఆపాలని ఇటీవల శాంతి చర్చల కమిటీ సీఎం ను కలిసింది. దీనిపై పార్టీ నిర్ణయం తర్వాతే ప్రభుత్వ ప్రకటన ఉటుందని సీఎం వెల్లడించారు. ఈ అంశాన్ని కూడా పార్టీ పెద్దల దృష్టికి సీఎం తీసుకువెళ్లే చాన్స్ ఉంది.

Next Story