- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : అధిష్టానంతో నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన(Delhi Tour)లో ఉన్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన(Delhi Tour)లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) అధ్యక్షతన శనివారం నీతి ఆయోగ్(NITI AYOG) సమావేశానికి హాజరైన రేవంత్ రెడ్డి.. ఇవాళ కాంగ్రెస్ పెద్దలతో పాటు కేంద్రమంత్రులను కలవనున్నట్టు సమాచారం. అయితే నేడు కాంగ్రెస్ అధిష్టానంతో కీలక చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కేబినెట్ విస్తరణ అంశం ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకు రానుంది. అలాగే పార్టీ కార్యవర్గం విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ అంశాలపై నేడు ప్రధానంగా ఏఐసీసీ(AICC) కారుదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal)తో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్(Rahul Gandhi)ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు కేబినెట్ బెర్త్‌లు భర్తీ చేస్తారంటూ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన పలు నిధులు, పలు ప్రాజెక్టుల అనుమతుల కోసం కేంద్ర మంత్రులతో కూడా ముఖ్య సమావేశాలు జరగనున్నట్టు మీడియా సమాచారం.






