TG: ‘నాకు చాలా గర్వంగా ఉంది’.. CM రేవంత్ హర్షం

by Gantepaka Srikanth |

ప్రజా ప్రభుత్వం చేపట్టిన కులగణన(Caste Census)పై అధ్యయనం చేయడానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఛైర్మన్‌గా నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశం అయ్యారు.

TG: ‘నాకు చాలా గర్వంగా ఉంది’.. CM రేవంత్ హర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా ప్రభుత్వం చేపట్టిన కులగణన(Caste Census)పై అధ్యయనం చేయడానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఛైర్మన్‌గా నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశం అయ్యారు. ప్రజాప్రభుత్వం చేపట్టిన కులగుణన అత్యంత శాస్త్రీయంగా, ప్రమాణికంగా, నమ్మశక్యంగా ఉన్నదని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. ఈ సర్వే చరిత్రాత్మకమని, దేశానికి ఈ సర్వే ఒక రోల్ మోడల్ అని కమిటీ పేర్కొంది. ఈ సందర్భంగా వారు చేసిన కొన్ని సూచనలు, సలహాలను కేబినెట్‌లో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిటీకి స్పష్టం చేశారు. సామాజిక న్యాయం, అన్నీ వర్గాల సాధికారతే లక్ష్యంగా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు.. నా సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ఈ సర్వేను నిర్వహించడం నాకు గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం శ్రీ భట్టీ విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, నిపుణుల కమిటీ వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య, నిపుణుల కమిటీ ఇతర సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం ట్వీట్

Next Story