పది రోజుల్లో అందరికీ ఇందిరమ్మ ఇండ్లు.. CM రేవంత్ భారీ గుడ్ న్యూస్

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-19 12:52:04  IST  )

ఇందిరమ్మ ఇండ్ల(Indiramma indlu) లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భారీ శుభవార్త చెప్పారు.

పది రోజుల్లో అందరికీ ఇందిరమ్మ ఇండ్లు.. CM రేవంత్ భారీ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇందిరమ్మ ఇండ్ల(Indiramma indlu) లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భారీ శుభవార్త చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో భూమి లేని చెంచుల విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించి పది రోజుల్లోగా అందరికీ ఇండ్లు కేటాయిస్తామని కీలక ప్రకటన చేశారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో పర్యటించారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సోలార్ విద్యుత్ ఆధారిత వ్యవసాయం చేసే నియోజకవర్గంగా అచ్చంపేటను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. రోబోయే వంద రోజుల్లో ఈ నియోజకవర్గంలో రైతులందరికీ వందశాతం సబ్సిడీతో సోలార్ విద్యుత్ పంపుసెట్లను అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నియోజకవర్గంలో వచ్చే వంద రోజుల్లో రైతులందరికీ సోలార్ విద్యుత్ పంపుసెట్లను అమర్చాలి. ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్‌ను వ్యవసాయానికి, గృహావసరాలకు వినియోగించగా కొంత మిగులు ఉండేలా, ఆ మిగులు విద్యుత్‌ను ప్రభుత్వ గ్రిడ్‌కు అనుసంధానం చేసే విధంగా ఉండే ప్యానెల్స్ ఏర్పాటు చేయాలి. మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయడం ద్వారా నెలకు 3 నుంచి 5 వేల రూపాయల మేరకు ఆదాయం లభించాలి. ఈ గ్రామంలో ప్రారంభించిన ఈ పథకం నియోజకవర్గం మొత్తంలో విస్తరించడంతో పాటు ఈ పథకంపై లబ్దిదారులకు అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక ఐఏఎస్‌ అధికారిని నియమించాలి. వచ్చే సంవత్సరం ఇదే రోజు మరోసారి పర్యటించి ఇక్కడ ప్రారంభించిన ఇందిర సౌర గిరి జల వికాసం పురోగతిని పరిశీలిస్తా అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు తెలియజేశారు.

Next Story