- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy : మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల(BC Reservations Bill) బిల్లుకు మద్ధతు తెలపాలని ప్రధాని నరేంద్ర మోడీతోపాటు పలు పార్టీల నేతలను కోరడానికి ఈ టూర్ ముఖ్య ఉద్దేశం అని సమాచారం. కాగా తెలంగాణలో కులగణన రీసర్వే(Cast Census Re Susrvey) నేటితో పూర్తయింది. మార్చి 6న రాష్ట్ర కేబినెట్లో బీసీల రిజర్వేషన్ల బిల్లు మద్దతు తెలిపి, అనంతరం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో(Assembly Sessions) ప్రవేశపెట్టి బిల్లుకు ఆమోద ముద్ర వేయనుంది రాష్ట్ర సర్కార్. మార్చి 10 నుంచి పార్లమెంటు సమావేశాలు(Parliament Sessions) జరగనున్న నేపథ్యంలో.. ఎలాగైనా బీసీల రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. అందుకోసం మార్చి 9న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ప్రధానిని కలవనున్నారు. ఎలాగైనా ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేయించి తెలంగాణలో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రయాణంపై సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే పనుల కోసం ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తానని స్పష్టం చేశారు. కాగా వరంగల్ ఎయిర్పోర్టు(Warangal Airport)కు నేడు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టులకు అనుమతులపై కూడా సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్రమంత్రులతో చర్చించనున్నారు.






