కార్పొరేట్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గొద్దు.. అధికారులకు CM రేవంత్ ఆదేశం

by Gantepaka Srikanth |

పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు.

కార్పొరేట్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గొద్దు.. అధికారులకు CM రేవంత్ ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌పై దృష్టి సారించాలని చెప్పారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలని అన్నారు. ప్లే గ్రౌండ్, అవసరమైన తరగతి గదులతోపాటు మంచి వాతావరణం ఉండేలా చూడాలని చెప్పారు. ఇందుకు విద్యాశాఖ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. సరైన సౌకర్యాలు లేని పాఠశాలలను దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలానికి తరలించాలని.. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు నూతన స్కూల్స్‌ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అన్నారు. అక్కడ కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అన్ని వసతులతో విద్యను అందించే ఏర్పాటు చేయాలి.. విద్యార్థులకు పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేలా ప్రణాళికలు.. 2026 జూన్‌లో అకడమిక్ ఇయర్ నుంచి అమలు జరిగేలా యాక్షన్ ప్లాన్2తో ముందుకెళ్లాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Next Story