- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగాది స్పెషల్.. రాష్ట్ర ప్రజలకు CM రేవంత్ శుభవార్త
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉగాది పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉగాది పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఆదివారం నుంచి శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ధర్మబద్దమైన కోరికలు నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, పాడి పంటలతో రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ముఖ్యమంత్రి అభిలషించారు. ఉగాది పండుగ(Ugadi Festival) రోజున రాష్ట్రంలో రేషన్ కార్డు(Ration Card) ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ ఏడాదిలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, సంక్షేమ పథకాల అమల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా ప్రతి ఒక్కరు ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.






