- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు
గులాబీ పార్టీ(BRS Party) అధినేతపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి నిప్పులు చెరిగారు.

దిశ, వెబ్ డెస్క్ : గులాబీ పార్టీ(BRS Party) అధినేతపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి నిప్పులు చెరిగారు. బుధవారం రవీంద్రభారతిలో జరిగిన 892వ బసవేశ్వర జయంతి(Basaveshwara Jayanthi) వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) కాంగ్రెస్ ను విలన్ అనడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఏడు దశాబ్దాల కలను నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? మరెందుకు విలన్ అయిందో చెప్పాలని నిలదీశారు. తాము బీఆర్ఎస్ సభకు సంపూర్ణంగా సహకరించామని, ఎప్పుడో ఒకనాడు సభ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదని.. ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల్లోకి వెళ్ళి అప్పుడు మాట్లాడాలని తెలిపారు.
గత ప్రభుత్వ పథకాలు ఆగిపోయాయని అంటున్నారని.. రైతుబంధు, రుణమాఫీ, ప్రజాపాలన ఆగిందా అని ప్రశ్నించారు. తాము సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టామని అవి కేసీఆర్ కు కనబడటం లేదా అని నిలదీశారు. తాము ఇంకా పదేళ్ళు అధికారంలో ఉంటామని, కేసీఆర్ అదే ఫాంహౌసుకు అంకితం అవుతారని ఎద్దేవా చేశారు. వరంగల్ సభతో పాపాలు కడుక్కోవాలని ఆయన చూసినట్టు ఉన్నారని, కాని చేసిన పాపాలు ఊరికే పోవని.. ఇంకా అనుభవించాల్సింది ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.






