- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ.. ఇండోర్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
బీజేపీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్యాంగాన్ని మార్చాలని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) కుట్ర చేస్తున్నారని ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నాల్లోనే ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. అయితే రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతున్నారని అన్నారు. సోమవారం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'జై బాపు, జై భీమ్, జై సంవిధాన్' (Jai Bapu, Jai Bhim, Jai Samvidhan) ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. గజనీ మహమ్మద్ హిందుస్తాన్ ను దోచుకోవడానికి ప్రయత్నించినట్లు…రాజ్యాంగాన్ని మార్చాలని మోడీ ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన ప్రయత్నం ఫలించడంలేదన్నారు. ఆనాడు బ్రిటిషర్ల నుంచి మహాత్మా గాంధీ దేశాన్ని రక్షించినట్లు.. భారతీయ జనతాపార్టీ పేరుతో చలామని అవుతున్న బ్రిటిష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిలబడ్డారన్నారు. ఈ యుద్ధంలో మనమంతా రాహుల్ గాంధీతో కలసి నడవాలి రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు మనమంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇది ఎన్నికల ర్యాలీ కాదని ఇది ఇది ఒక యుద్ధం అన్నారు. ఈ యుద్ధం గాంధీ పరివార్ కు గాడ్సే పరివార్ మధ్య జరుగుతున్నదన్నారు. గాడ్సే పరివార్ వైపు నుంచి మోడీ… గాంధీ పరివార్ వైపు నుంచి రాహుల్ గాంధీ పోరాడుతున్నారని అందుకే మనమంతా గాంధీ పరివార్ గా రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలబడాలన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తేస్తాం: రాహుల్ గాంధీ
తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభల ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో స్వాతంత్ర్యం పూర్వం నాటి పరిస్థితులను బీజేపీ-ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని ఆరోపించారు. ఇండోర్ ర్యాలీలో ప్రసగించిన ఆయన.. దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలు, పేదలను మరోసారి భానిసలుగా మార్చాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ (జీఎస్టీ) పేద ప్రజలను తొలగించే ఆయుధాలని ఈ దేశంలో బీజేపీ అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నదని ధ్వజమెత్తారు. ఈ బిలియనీర్లు ఎంత ఎక్కువ డబ్బు పొందుతారో, మీకు అంత తక్కువ ఉపాధి లభిస్తుంది.






