సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మేడారం మహా జాతర ఆహ్వానం

by Ajay Maddhiboyina |

మేడారం మ‌హాజాత‌ర‌కు ముస్తాబ‌వుతోంది. ఈ నెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు జాతర జరగనుంది. 19వ తేదీన గద్దెలు, ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ పనులు ప్రారంభం కానున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మేడారం మహా జాతర ఆహ్వానం
X

దిశ‌, వెబ్ డెస్క్: మేడారం మ‌హాజాత‌ర‌కు ముస్తాబ‌వుతోంది. ఈ నెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు జాతర జరగనుంది. 19వ తేదీన గద్దెలు, ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు అసెంబ్లీలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వాన పత్రికలను అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ మరియు మంత్రులకు ఆహ్వాన పత్రికలు ఇచ్చి వారిని ఆహ్వానించారు.

ఇక మేడారం అభివృద్ధి కోసం రేవంత్ స‌ర్కార్ రూ.230 కోట్లు కేటాయించ‌గా ప‌నులు చ‌క‌చ‌కా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రో వెయ్యి సంవ‌త్స‌రాలు నిలిచిపోయేలా రాతి క‌ట్ట‌డాల‌తో మేడారం అభివృద్ధి ప‌నులు చేస్తున్నారు. స‌మ్మ‌క్క సార‌లమ్మ‌ల త్యాగాలు ప్ర‌తిబింబించేలా భారీ ముఖ ద్వారాల‌ను, ప్ర‌హారీ గోడ‌ల‌ను నిర్మిస్తున్నారు. మ‌రోవైపు ఇప్ప‌టికే మేడారానికి భ‌క్తులు భారీగా త‌ర‌లివెళుతున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు పోటెత్తారు.

Next Story