- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: ఉపాధి కూలీలతో సిరుల సాగు.. పంచాయతీ కార్యదర్శికి సీఎం రేవంత్ రెడ్డి విషెస్
పంచాయతీ కార్యదర్శి భారత అవినాష్ కృషిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (National Employment Guarantee Scheme) జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా బీడు భూములను అభివృద్ధి చేసి సాగుకు యోగ్యంగా మార్చిన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం అక్కపల్లిగూడెం (Panchayat Secretary) పంచాయతీ కార్యదర్శి భారత అవినాష్ (Avinash) కృషిని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అభినందించారు. ఈ మేరకు సోమవారం సీఎంవో ఆఫీస్ ద్వారా ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక రైతులతో సంప్రదించి బీడు భూముల్లో ఉపాధి కూలీలతో పనులు చేయించి రాళ్ల నేలను సిరుల సాగుకు ఉపయుక్తంగా మార్చడం ద్వారా పంచాయతీ కార్యదర్శి అవినాష్ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని సీఎం కొనియాడారు. పట్టుదల, సంకల్పంతో ముందుకు సాగిన అవినాష్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
కాగా, అక్కపల్లిగూడెం పంచాయతీ కార్యదర్శి భారత అవినాష్ ఎంటెక్ చేశారు. వివిధ సామాజిక అంశాలపై ప్రొఫెసర్లు, సామాజిక వేత్తలు రాసే అర్టికల్స్‌ను అవినాష్ చదివేవారు. ఈ క్రమంలోనే జాతీయ ఉపాధీహామీ పథకం బిల్లు రూపకర్తల్లోని ఒకరైన జాన్ డ్రిన్ రాసిన రైతులకు అదనపు ఆదాయంపై వ్యాసాలు చదివి అవినాష్ స్పూర్తిపొందారు. ఈ క్రమంలోనే రైతులతో మాట్లాడి ఉపాధి కూలీలతో వారి భీడు భుమూల్లో పనులు చేయిస్తూ రైతులు పంటలు వేసుకునేలా మార్పు తీసుకొచ్చారు.






