- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏషియన్గోల్డ్ మెడల్ నందిని ఆగసరకు సీఎం రేవంత్ రెడ్డి అభినందన
26వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో హెప్టాథ్లాన్ విభాగంలో గోల్డ్మెడల్సాధించిన తెలంగాణ యువ కేరటం గురుకుల విద్యార్థిని అగసర నందిని సోమవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయనికి చేరుకొంది.

దిశ, తెలంగాణ బ్యూరో : 26వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో హెప్టాథ్లాన్ విభాగంలో గోల్డ్మెడల్సాధించిన తెలంగాణ యువ కేరటం గురుకుల విద్యార్థిని అగసర నందిని సోమవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయనికి చేరుకొంది. ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంస్థల సొసైటీ ఆధ్వర్యంలో సీనియర్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై ఆమెను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నందిని నేరుగా గురుకుల ప్రధాన కార్యాలయం, సబ్‌ట్యాంక్‌కు చేరుకుని కార్యదర్శి డా. వి.ఎస్. అలుగు వర్షినిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కార్యాలయంలో జరిగిన సత్కార కార్యక్రమంలో నందినిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నందిని మాట్లాడుతూ “ఏషియా స్థాయిలో నా పేరిట నెలకొన్న రికార్డును ఇప్పటివరకు ఎవరూ చేరుకోలేదని, ఇది నాకు ఎంతో గర్వకారణంగా,”ఉందని అన్నారు. “ఒలింపిక్స్‌లో దేశానికి బంగారు పతకాన్ని అందించాలన్నదే నా తదుపరి లక్ష్యం ఇప్పుడే విశ్రాంతి తీసుకునే సమయంలో కాదు. ఇంకా తీవ్రంగా శ్రమించి, ప్రపంచ స్థాయి వేదిక పై నిలవాలనుకుంటున్నాను,” అని చెప్పారు. “నా విజయాలకు ఆధారం, గురుకులం ఇచ్చిన ప్రోత్సాహం, శిక్షణ, అచంచలమైన మద్దతేనని పేర్కొన్నారు. కార్యదర్శి డాక్టర్వర్షిని మాట్లాడుతూ.. తమ సొసైటీ క్రీడాకారిణి అత్యున్నతమైన ప్రతిభ కనబరిచి దేశానికే ఆదర్శంగా నిలిచిందని నందిని ఆమె అభినందించారు.
రానున్న రోజుల్లో ఒలంపిక్ గేమ్స్ లకు పాల్గొనేందుకు కావలసిన శిక్షణతో పాటు తగిన సహాయ సహకారాలు అందిస్తానని ఆమె భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు నందిని కి ఖర్చుచేసిన ట్రావెల్ ఖర్చులను కూడా తమ సంస్థ భరిస్తుందని ఆమె హామీ ఇచ్చారు. ఈ స్థాయికి చేరుకునేందుకు సహకరించిన తల్లిదండ్రులు అగసరి ఎల్లప్ప, అయ్యమ్మ ప్రోత్సహం మరువలేనిదని కార్యదర్శి ప్రశంసించారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి అభినందన
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డిని యువ అథ్లెట్ అగసర నందిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఏషియన్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో స్వర్ణపతకం సాధించడం ద్వారా విశ్వవేదికపై తెలంగాణ ప్రతిష్టను చాటిచెప్పిన నందినిని ముఖ్యమంత్రి అభినందించారు. ఇటీవల దక్షిణ కొరియా వేదికగా జరిగిన 26వ ఏషియన్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో తెలంగాణ అథ్లెట్ అగసర నందిని భారత్ తరఫున స్వర్ణపతకం సాధించారు.






