CM Revanth Reddy : కోహ్లీకి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

by Muthe.Rajitha |

టీంఇండియా టెస్ట్ క్రికెట్(Test Cricket) నుంచి విరాట్ కోహ్లీV(irat Kohli) నేడు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

CM Revanth Reddy : కోహ్లీకి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
X

దిశ, వెబ్ డెస్క్ : టీంఇండియా టెస్ట్ క్రికెట్(Test Cricket) నుంచి విరాట్ కోహ్లీV(irat Kohli) నేడు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) కోహ్లీకి అభినందనలు తెలిపారు. టెస్ట్ క్రికెట్‌ నుంచి రిటైరవుతున్న విరాట్ కోహ్లీ తన తదుపరి ప్రయాణంలో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు విరాట్ కోహ్లీ అని, టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యద్భుతమైన అధ్యాయాన్ని కొనసాగించారని అభినందించారు. ఎన్నో సరికొత్త రికార్డులు నెలకొల్పిన కోహ్లీ తన క్రికెట్ కెరీర్‌లో అత్యంత క్రమశిక్షణ, నిబద్ధత గల ఆటగాడిగా నిలిచారని ప్రశంసించారు. కోహ్లీ ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు.

Next Story