MLA మాగంటి గోపీనాథ్ మృతిపట్ల CM రేవంత్ సంతాపం

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంతాపం తెలిపారు.

MLA మాగంటి గోపీనాథ్ మృతిపట్ల CM రేవంత్ సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంతాపం తెలిపారు. గోపీనాథ్ మృతి బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. జూబ్లీహిల్స్‌ అభివృద్ధికి ఆయన చాలా కృషి చేశారు. గోపీనాథ్ అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా, గత కొన్ని రోలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం 5.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం (ఈ నెల 5న) తీవ్రమైన ఛాతీనొప్పితో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. గోపీనాథ్‌కు భార్య సునీత, కుమారుడు వాత్సల్యనాథ్‌, కుమార్తె అక్షరనాగ ఉన్నారు. జూబ్లీహిల్స్ నుంచి వరుగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Next Story