శివశక్తి దత్తా మృతి ఇండస్ట్రీకి తీరని లోటు: CM రేవంత్ సంతాపం

by Gantepaka Srikanth |

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత MM కీరవాణి తండ్రి శివశక్తి దత్తా (Siva Shakthi Datta) కన్నుమూసిన విషయం తెలిసిందే.

శివశక్తి దత్తా మృతి ఇండస్ట్రీకి తీరని లోటు: CM రేవంత్ సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత MM కీరవాణి తండ్రి శివశక్తి దత్తా (Siva Shakthi Datta) కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తాజాగా శివశక్తి దత్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిత్రకారుడిగా జీవితాన్ని ప్రారంభించి తనదైన శైలిలో రచనలు చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న శివదత్తా మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. శివశక్తి దత్తా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ముఖ్యమంత్రి కీరవాణి(MM Keeravani) కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ట్వీట్

కాగా, ఇప్పటికే శివశక్తి దత్తా మృతిపై ఇండస్ట్రీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సహా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Next Story