- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: సౌమ్య మృతికి కారణమైన వారికి కఠిన శిక్ష: సీఎం రేవంత్ రెడ్డి
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకునే క్రమంలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య జీవితం అర్థాంతరంగా ముగిసింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకునే క్రమంలో గాయపడి మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (25) (Excise Constable Soumya) మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో సౌమ్య ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని సౌమ్య మృతికి కారణమైన వారిని కఠింగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా జనవరి 23న నిజామాబాద్‍లో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా తమ వాహనంతో సౌమ్యను తొక్కించుకుంటూ పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి సౌమ్యను మెరుగైన వైద్యం కోసం పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యలు శ్రమించినా పరిస్థితి విషమించడంతో సౌమ్య శనివారం రాత్రి తుదిశ్వాస విడిచింది.
Read More..
విధి నిర్వహణలో వీరమరణం.. కానిస్టేబుల్ సౌమ్య ధైర్యానికి సీపీ సజ్జనార్ సెల్యూట్
Next Story






