- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రియల్ లీడర్ అద్దంకి దయాకర్.. సగం జీతం వాళ్ళకే !

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ( Addanki Dayakar) గొప్ప మనసు చాటుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి.. తన జీవితంలో నుంచి డబ్బులు ఇస్తున్నారుఅద్దంకి దయాకర్. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth reddy) బహిర్గతం చేశారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పై... ఆయన పనితనంపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో అందరూ అద్దంకి దయాకర్ లాగా ఓపికతో ఉండాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అద్దంకి దయాకర్ కు ముందు ఎమ్మెల్యే టికెట్.. ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. కానీ సడన్ గా.. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కాంగ్రెస్ వెనక్కి తగ్గిందన్నారు. కానీ అద్దంకి దయాకర్ మాత్రం... తొందరపడకుండా కాంగ్రెస్ పార్టీలోనే (Congress Party) ఓపికగా పనిచేశారని కొనియాడారు. ఇక ఆయన ఓపికతో ఉన్నాడు కాబట్టి... ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వచ్చిందని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇలా అందరూ కార్యకర్తలు అలాగే పార్టీ నేతలు పని చేయాలని కోరారు. తన జీవితంలో కూడా 10 శాతం ఏఐసీసీకి ఇస్తున్నాడని పేర్కొన్నారు. అదే సమయంలో పీసీసీకి 15% జీతం నుంచి ఇస్తున్నాడని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఇలాంటి పార్టీ లీడర్లు... ఉంటే కాంగ్రెస్ దూసుకు వెళ్తుందని చెప్పారు. కాగా.. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అయ్యారు అద్దంకి దయాకర్. కాంగ్రెస్ పార్టీ కోసం గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేసి... ఈ పదవి దక్కించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా అద్దంకి దయాకర్ పాత్ర చాలా కీలకమైనది.