నేను డాక్టర్‌ను కాదు.. కానీ సోషల్ డాక్టర్‌ను: సీఎం రేవంత్ రెడ్డి

by Ajay Maddhiboyina |

హైదరాబాద్‌లో జరిగిన ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తాను డాక్టర్‌ను కాదు కానీ సోషల్ డాక్టర్‌ని అన్నారు.

నేను డాక్టర్‌ను కాదు.. కానీ సోషల్ డాక్టర్‌ను: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో జరిగిన ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తాను డాక్టర్‌ను కాదు కానీ సోషల్ డాక్టర్‌ని అన్నారు. సమాజంలోని రగ్మతలను గుర్తించి వైద్యం చేస్తానని చెప్పారు. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యం అని సీఎం వ్యాఖ్యానించారు. కొత్త విషయాలను తెలుసుకోవడం, నైపుణ్యాన్ని పెంచుకోవడం మానేస్తే మీ కెరీర్‌కు ముగింపు పలికినట్లే అవుతుందని అన్నారు. ఈ కాన్ఫరెన్స్ హైదరాబాద్‌లో జరగడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ అనుబంధ రంగాలలో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ప్రజల ప్రయోజనాల కోసం తమ పాలసీని మెరుగుపరచడానికి, వైద్యులతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పారు. ఆ దిశగా డాక్టర్లు సలహాలు, సూచనలు ఇచ్చి సహకరించాలని కోరారు.

Next Story