- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: మధ్యప్రదేశ్ ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. అధికారులకు కీలక ఆదేశాలు
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని జబల్‌పూర్ (Jabalpur) జిల్లా పరిధిలో హైదరాబాద్ (Hyderabad)కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది.

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని జబల్‌పూర్ (Jabalpur) జిల్లా పరిధిలో హైదరాబాద్ (Hyderabad)కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. నగర పరిధిలోని నాచారం (Nacharam) నుంచి కొంత మంది భక్తులు ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతోన్న మహా కుంభమేళా (Maha Kumbhmela)కు మినీ బస్సులో వెళ్లారు. అయితే, తిరుగు ప్రయాణంలో బజల్‌పూర్ (Jabalpur) జిల్లా కేంద్రానికి 65 కి.మీ. దూరంలో ఉన్న సిహోరా (Sihora) పట్టణ శివారులో ఆ మినీ బస్సును ఎదురుగా వన్ వేలో వస్తున్న ఓ ట్రక్కు (Truck) బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, తాజాగా ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అదేవిధంగా సహయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.






