KTR : 420 దొంగ హామీలతో సీఎం రేవంత్ రెడ్డి మోసం : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-18 09:27:08  IST  )

420 దొంగ హామీ(420 False Promises)లు ఇచ్చి నంగనాచి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్యమంత్రి అయ్యిండని.. తెలంగాణ ప్రజలను విజయవంతంగా మోసం చేస్తున్న రేవంత్‌కు బుద్ది చెప్పే పని కల్వకుర్తి నుంచే మొదలుకావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పిలుపునిచ్చారు.

KTR : 420 దొంగ హామీలతో సీఎం రేవంత్ రెడ్డి మోసం : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : 420 దొంగ హామీ(420 False Promises)లు ఇచ్చి నంగనాచి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్యమంత్రి అయ్యిండని.. తెలంగాణ ప్రజలను విజయవంతంగా మోసం చేస్తున్న రేవంత్‌కు బుద్ది చెప్పే పని కల్వకుర్తి నుంచే మొదలుకావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పిలుపునిచ్చారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని అమన్‌గల్‌(Amangal)లో జరిగిన రైతు మహాధర్నా(Farmers' Mahadharna)లో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

రియల్ ఎస్టేట్ గురించి తప్ప స్టేట్ గురించి రేవంత్ రెడ్డికి ఎలాంటి పట్టింపు లేదని, ఎన్నికల తర్వాత కల్వకుర్తి ప్రాంతంలో దాదాపు 1000 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సంపాదించారని..ఆ భూముల రేట్లు పెంచుకోవడానికే ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. 600 కోట్ల రూపాయలు ఇస్తే సర్పంచుల పెండింగ్ బిల్లుల సమస్య పరిష్కారం అవుతుందని ఆ పని చేయడం లేదని విమర్శించారు. రేపటి రోజున ఆడబిడ్డల పుస్తెల తాళ్లు కూడా తెంపుకుపోయే దరిద్రపు పాలన రాష్ట్రంలో ఉందన్నారు.కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఎవరికి న్యాయం చేయలేదని.. అక్కడ ఎవరికి రైతుబంధు రాలేదని.. రుణమాఫీ కాలేదని..కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవ్వలేదని..ఆడబిడ్డలకు 2,500 రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సొంత నియోజకవర్గంలో ఒక్క పని చేయలేదని.. పుట్టి పెరిగిన.. పిల్లనిచ్చిన కల్వకుర్తి ప్రాంతానికి కూడా ఒక్క రూపాయి పని చేయలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రాజు లాగా రైతు ఎవరి దగ్గర చేయి చాపకుండా బ్రహ్మాండంగా బతికిండని..పదేళ్లు మోటార్లు కాలలేదని..ట్రాన్స్‌ఫార్మర్లు పేలలేదని. పదేళ్లు రైతులు ఎవరి దగ్గర అప్పులు అడిగే పరిస్థితి లేకుండేనని..నాట్లేసే టైంకి టింగు టింగు మని రైతుబంధు పైసలు పడుతుండెనని..టకీ టకీ మని రైతుభరోసా ఇస్తనని రేవంత్ రెడ్డి గప్పాల్ కొట్టిండు.. కానీ రూపాయి కూడా ఇవ్వలేదని కేటీఆర్ దుయ్యబట్టారు. కేసీఆర్ కంటే ఎక్కువగా రైతు భరోసా రూ. 15,000 ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పిండు కానీ 10 శాతం మంది రైతులకు కూడా ఇవ్వలేదన్నారు. సోనియా జన్మదినం సందర్భంగా రుణమాఫీ ఒకేసారి రెండు లక్షలు చేస్తానని చెప్పిండని.. కానీ ఇప్పటివరకు చారాణ రుణమాఫీ కూడా చేయలేదన్నారు.

500 బోనస్ 10% మంది కూడా పడలేదని..ఆడబిడ్డలకు అరచేతిలో స్వర్గం చూపించిండని విమర్శించారు. పిల్లనిచ్చిన అత్తగారి ప్రాంతంలోనీ ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రతినెలా 2,500 రూపాయలు ఇస్తున్నాడేమో అనుకున్నామని..అయితే అత్తగారి ప్రాంతాన్ని కూడా మోసం చేసిండని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే 35 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టడంతోనే రేవంత్ రెడ్డికి సరిపోయిందని.. కానీ ఢిల్లీ నుంచి 35 పైసలు కూడా తేలేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రివర్స్ మైగ్రేషన్‌తో వేరే రాష్ట్రాల కూలీలు పాలమూరుకు వచ్చి పనిచేసేవారని గుర్తు చేశారు.

బ్యాంకర్లు రుణాల వసూళ్ల పేరుతో మొన్న తలుపులు ఎత్తుకుపోయారని.. నిన్న స్టార్టర్లు ఎత్తుకుపోయారని... ఇక రేపు మీ పుస్తెలతాడు కూడా రేవంత్ రెడ్డి ఎత్తుకుపోతడని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి దొంగ అని ఎలక్షన్ల ముందు చెప్పినామని..తెలంగాణ మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డి మోసాన్ని తెలుసుకుందన్నారు. రైతుకు కులం లేదు, మతం లేదని.. 70 లక్షల మంది రైతులను కేసీఆర్ పదేళ్లు కడుపులో పెట్టుకొని చూసుకున్నారన్నారు. 3,000 కోట్ల రూపాయల రైతుబంధు పైసలు రైతుల ఖాతాల్లో వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో కేసీఆర్ ఒక్కరేనని, స్వతంత్ర భారతదేశ చరిత్రలో రైతు చనిపోతే అతని కుటుంబానికి రూ.5 లక్షల బీమా ఇచ్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ మేనమామ లెక్క ఆడబిడ్డ పెండ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో లక్ష రూపాయలు ఇచ్చిండని..200 రూపాయల పెన్షన్‌ను పదిరెట్లు పెంచి 2,000 రూపాయలు చేసిండన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి4 2% రిజర్వేషన్ల పేరుతో బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేసిండన్నారు. రైతు భరోసా రూ. 15,000 ఇస్తానని అన్నదాతలను మోసం చేసిండని, రూ. 12,000 ఇస్తానని రైతు కూలీలను మోసం చేసిండని..నెలకు రూ. 2,500 ఇస్తానని ఆడబిడ్డలను మోసం చేసిండని, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానన్నాడని, లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇస్తా అనీ వాళ్లను మోసం చేసిండని కేటీఆర్ గుర్తు చేశారు.

ఇలా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి విజయవంతంగా మోసం చేస్తూనే ఉన్నాడన్నారు. కాంగ్రెస్ 420 పాలనలో 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, గురుకుల పాఠశాలలను నడపడం చేతకాని సన్నాసి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికి 56 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం విషాదకరమని, కాంగ్రెస్ దరిద్రపు పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ రైతుబంధు కోసం ఉంచిన పైసల్నే రేవంత్ రెడ్డి వేసిండని.. అంతేకానీ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క రూపాయి కూడా రైతు భరోసా కింద ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఒక్కో ఎకరానికి రూ. 17,500 రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడని, స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకొని తెలంగాణ ప్రజలు నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Next Story