- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బతుకమ్మకుంటకు వీహెచ్ పేరు.. స్వయంగా ప్రకటించిన CM రేవంత్
దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కబ్జాల నుంచి రక్షించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిన అంబర్‌పేట బతుకమ్మకుంట(Bathukamma Kunta)ను బతుకమ్మ పండుగ శుభ సందర్భంగా సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించి నగర ప్రజలకు అంకితం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కబ్జాల నుంచి రక్షించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిన అంబర్‌పేట బతుకమ్మకుంట(Bathukamma Kunta)ను బతుకమ్మ పండుగ శుభ సందర్భంగా సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించి నగర ప్రజలకు అంకితం చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా కబ్జా కోరల్లో చిక్కుకుని చెత్త కుప్పలతో డంపింగ్ యార్డుగా మారి దుర్గంధం వెదజల్లుతున్న ఆ ప్రాంతం కేవలం వంద రోజుల్లో అత్యంత సుందరమైన కోనేరుగా రూపుదిద్దుకోవడం పట్ల సర్వత్రా ఆనందాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా బతుకమ్మ పండుగ శుభవేళ.. అత్యంత వైభవంగా రూపుదిద్దుకున్న బతుకమ్మకుంట నీటిలో ముఖ్యమంత్రి బతుకమ్మను వదిలి గంగమ్మ తల్లికి హారతి ఇచ్చి పూజలు చేశారు. ఈ కుంటకు మాజీ ఎంపీ వీ.హనుమంతరావు(V. Hanumantha Rao) పేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నేడు బతుకమ్మ కుంటను ప్రారంభించిన సందర్భంగా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.






