సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహ రిసెప్షన్‌కి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, ప్రముఖులు

by Ramesh Naini |

ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది.

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహ రిసెప్షన్‌కి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, ప్రముఖులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది. హైద‌రాబాద్‌లో ఇవాళ తెల్లవారుజామున తన ప్రియురాలు హరిణ్య రెడ్డి మెడలో మూడు ముళ్లు వేసి వివాహ బంధంలో అడుగుపెట్టారు. వీరి వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఇవాళ సాయంత్రం రాహుల్ సిప్లిగంజ్-హరిణ్య రెడ్డి వివాహ రిసెప్షన్ నిర్వహించారు. ఈ రిసెప్షన్‌కు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావులు ఈ రిసెప్షన్‌‌కు హాజరయ్యారు.

కాగా, రాహుల్ సిప్లిగంజ్ వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, టాలీవుడ్ సిని పరిశ్రమలో సింగర్‌గా రాహుల్ సిప్లిగంజ్ ఎంతో బిజీగా ఉన్నారు. అతను పాడిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఇండస్ట్రీలో రాహుల్ క్రేజ్ మరింత పెరిగింది.

Next Story