- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లో డిసెంబర్ 17 నుంచి 22 వరకు శీతాకాల విడిది గడిపిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము సోమవారం హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో డిసెంబర్ 17 నుంచి 22 వరకు శీతాకాల విడిది గడిపిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము సోమవారం హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రపతికి గౌరవపూర్వకంగా వీడ్కోలు పలికారు. కాగా ఆదివారం రాష్ట్రపతి నిలయం (బొల్లారం)లో నిర్వహించిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి సీఎం రేవంత్ తోపాటు పలువురు మంత్రులు హాజరైన సంగతి తెలిసిందే. ఈ శీతాకాల విడిది సమయంలో రాష్ట్రపతి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేడు సీఎంతోపాటు రాష్ట్ర అధికారులు, ప్రజాప్రతినిధులు ఆమెకు గౌరవంగా వీడ్కోలు తెలిపారు.
Next Story






