‘మీరు నాకు అందుబాటులో ఉండండి’.. ఆ సామాజికవర్గ ఎమ్మెల్యేలకు CM రేవంత్ సూచన

by Gantepaka Srikanth |

తెలంగాణ మంత్రివర్గ(Telangana Cabinet) విస్తరణ వేళ మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక హామీ ఇచ్చారు.

‘మీరు నాకు అందుబాటులో ఉండండి’.. ఆ సామాజికవర్గ ఎమ్మెల్యేలకు CM రేవంత్ సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రివర్గ(Telangana Cabinet) విస్తరణ వేళ మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక హామీ ఇచ్చారు. తాజా విస్తరణలో తప్పకుండా ఒకరికి కేబినెట్‌లో చోటు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేలంతా(Madiga MLAs) అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కాలే యాదయ్యలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇదిలా ఉంటే.. కేబినెట్‌ విస్తరణకు కాంగ్రెస్‌ అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆదివారం మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశముంది. కొత్తగా ముగ్గురు లేదా నలుగురికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రెడ్డి, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఈ విస్తరణలో చోటు ఉంటుందని సమాచారం. ఓసీ సామాజిక వర్గానికి లేకుండా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.

Next Story