- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడారం చేరుకున్న CM రేవంత్ రెడ్డి.. కాసేపట్లో అధికారులతో సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాసేపటి క్రితం మేడారం (Medaram)కు చేరుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాసేపటి క్రితం మేడారం (Medaram)కు చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క కూడా ఉన్నారు. ముందుగా ఆలయ ఆర్చకులు సాంప్రదాయ రీతిలో సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన సమక్క-సారలమ్మ అమ్మవార్ల గద్దెలకు పూలమాలలు వేసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అన్నవార్లకు సీఎం రేవంత్ రెడ్డి తరాజులో కూర్చొని తన నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. కాసేపట్లో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ (Konda Surekha) ఆధ్వర్యంలో మేడారం ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అదేవిధంగా అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్ (Digital Plan)ను విడుదల చేయనున్నారు. ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా మేడారంను అభివృద్ధి చేయడంతో పాటు మహాజాతర నాటికి పనులు పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ టార్గెట్‌గా పెట్టుకుంది.






