CM Revanth Reddy : హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |   (  Updated:2025-04-23 15:49:11  IST  )

వారం రోజుల జపాన్ పర్యటన(Japan Tour) ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్(Hyderabad) కు చేరుకున్నారు.

CM Revanth Reddy : హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : వారం రోజుల జపాన్ పర్యటన(Japan Tour) ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్(Hyderabad) కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. కాగా మరికొద్దిసేపట్లో సీఎం సంగారెడ్డికి వెళ్లనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూతురు నిశ్చితార్థానికి హారయ్యేందుకు ఆయన సంగారెడ్డి వెళ్తున్నట్టు సమాచారం. దాదాపు 7 రోజుల పాటు జపాన్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం.. అక్కడ పలు పారిశ్రామిక సంస్థలతో రూ.12,062 కోట్ల పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక ఈనెల 25, 26న హైదరాబాద్ వేదికగా జరగనున్న 'భారత్ సమ్మిట్"(Bharat Summit) ఏర్పాట్లపై రేపు మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

Next Story