- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్న CM రేవంత్ రెడ్డి.. కాసేపట్లో ప్రధాని విందుకు హాజరు
సీఎం రేవంత్ రెడ్డి ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగే ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ విందుకు ఆయన హాజరుకానున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ముంబైలో జరిగిన ‘క్లైమేట్ వీక్’ సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అక్కడి నుంచి నేరుగా హస్తినకు చేరుకున్నారు. దేశ రాజధానిలోని భారత్ మండపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ - 2026’ (India AI Impact Summit)లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు ఆయన హాజరుకానున్నారు. ఈ సదస్సుకు ఓపెన్ ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్‌మాన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి గ్లోబల్ టెక్ లీడర్లతో పాటు సుమారు 40 మందికి పైగా అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఐటీ మంత్రులు, 45కు పైగా దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’ అనే థీమ్ తో జరుగుతున్న ఈ సదస్సులో ఆరోగ్యం, వ్యవసాయం, విద్య వంటి రంగాల్లో కృత్రిమ మేధ (AI) వినియోగంపై చర్చలు జరిగాయి.
కాగా, హైదరాబాద్ (Hyderabad)ను గ్లోబల్ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఈ పర్యటన అత్యంత కీలకం. సదస్సులో పాల్గొనే అంతర్జాతీయ టెక్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యి, తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరించే అవకాశం ఉంది. అలాగే, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీతో కూడా ఆయన చర్చించే చాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.






