కొత్త మంత్రుల పేర్లు అధికారికంగా ప్రకటించిన CM రేవంత్

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-08 14:44:19  IST  )

కొత్తగా మంత్రివర్గంలో చేరబోతున్న ఎమ్మెల్యేల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారికంగా ప్రకటించారు.

కొత్త మంత్రుల పేర్లు అధికారికంగా ప్రకటించిన CM రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్తగా మంత్రివర్గంలో చేరబోతున్న ఎమ్మెల్యేల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా(X) వేదికగా పోస్టు పెట్టారు. వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరికి అభినందనలు తెలిపారు. వీరితో పాటు శాసన సభలో డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న రామచంద్రు నాయక్‌కి శుభాకాంక్షలు చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం 12.00 - 12.20 గంటల మధ్య వీరంతా సోమాజిగూడలోని రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. స్థానిక ఎన్నికల వేళ పార్టీలో ఎలాంటి విభేదాలకు తావివ్వకుండా బీసీల నుంచి వి.శ్రీహరి ముదిరాజ్, ఎస్సీల నుంచి వివేక్‌ (మాల), అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ (మాదిగ)లకు చోటు కల్పించారు. ఎస్టీ అయిన రామచంద్రునాయక్‌ను డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేశారు.

Next Story