- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్.. బనకచర్లపై కేంద్ర మంత్రితో కీలక భేటీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ ఉదయం ఢిల్లీ (Delhi)కి బయలుదేరారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ ఉదయం ఢిల్లీ (Delhi)కి బయలుదేరారు. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటనకు ఆయనతో పాటు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) కూడా వెళ్తున్నారు. ఈ మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్ (Tony Blair)తో సీఎం రేవంత్ బృందం సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. టోనీ బ్లెయిర్ ప్రస్తుతం ‘టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ (TBI)’ అనే ఎన్‌జీవో సంస్థను రన్ చేస్తున్నారు. ప్రస్తుతం టీబీఐ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలోనే టీబీఐతో తెలంగాణ స్టేట్ (Telangana State)కు అన్ని రంగాల్లో సహాయ సహకారాలతో పాటు ఇన్వెస్ట్‌మెంట్‌పై సీఎం రేవంత్, టోని బ్లెయిర్‌తో చర్చించనున్నారు.
ఇక మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ (CR Patil)తో సీఎం సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) నిర్మించ తలపెట్టిన గోదావరి-బనచర్ల (Godavari-Banakacharla) ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరాలను కేంద్ర మంత్రికి సమగ్రంగా వివరించనున్నారు. అందుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను సీడబ్ల్యూసీ (CWC) అధికారులకు కూడా అందజేయనున్నారు. అనంతరం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలవనున్నారు. చివరగా ఏఐసీసీ (AICC) పెద్దలతో భేటీ అయి పార్టీలో పదవుల భర్తీ, పెండింగ్‌లో ఉన్న పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి కీలకమైన అంశాలపై చర్చించే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి.






