- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓంకారేశ్వర ఆలయానికి సీఎం రేవంత్ శంకుస్థాపన.. పాల్గొన్న డిప్యూటీ సీఎం, మంత్రులు
మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు (Musi River Rejuvenation Project)లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ మేరకు ఇవాళ రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండల పరిధిలోని మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు పక్కనే ఉన్న వీరభద్ర ఆలయంలో కుటుంబంతో సహా పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాగా, ఇప్పటికే ఆలయ నిర్మాణానికి మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ (Musi River Front Corporation) డిజైన్ ఖరారు చేసింది. చారిత్రక వీరభద్ర స్వామి ఆలయ సమీపంలో 8 ఎకరాల్లో రూ.700 కోట్ల వ్యయంతో ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించబోతున్నారు. అందులో వంద అడుగుల గాలిగోపురం, మూసీ నది మధ్యలో దీవిపై వంద అడుగుల శివుడి విగ్రహం ప్రతిష్టించనున్నారు.






