MP Laxman : సీఎం రేవంత్ దేశాన్ని అవమానిస్తున్నారు : ఎంపీ లక్ష్మణ్

by Muthe.Rajitha |

హైదరాబాద్(Hyderabad) లో నిన్న జరిగిన జైహింద్(Jaihind) సభలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రసంగంపై బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్(BJP MP Laxman) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

MP Laxman : సీఎం రేవంత్ దేశాన్ని అవమానిస్తున్నారు : ఎంపీ లక్ష్మణ్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లో నిన్న జరిగిన జైహింద్(Jaihind) సభలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రసంగంపై బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్(BJP MP Laxman) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఇటీవల భారత సైన్యం సాధించిన విజయాన్ని తక్కువ చేస్తూ మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ట్రంప్ ఒత్తిడితో యుద్ధం ఆపేశారని అనడం ఆయన తెలివతక్కువ తనానికి నిదర్శనం అన్నారు. దేశ భద్రతపై బీజేపీకి పట్టింపు లేదని, పీవోకేను తిరిగి తీసుకునే శక్తి బీజేపీకి లేదనడం సరికాదన్నారు. రేవంత్ వ్యాఖ్యలు భారత సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని, దేశాన్ని అవమానించేలా ఉన్నాయని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి 2019లో జరిగిన పుల్వామా దాడి, బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్‌లను ప్రశ్నించడం దేశ భద్రతను తక్కువ చేసే చర్య అని విమర్శించారు. బీజేపీపై అక్కసుతో ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. మోడీ ప్రభుత్వం తెలంగాణకు రూ.5,000 కోట్ల రైల్వే అభివృద్ధి నిధులు కేటాయించిందని అయినప్పటికీ రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని లక్ష్మణ్ మండిపడ్డారు.

Next Story