Eatala Rajendar : తెలంగాణ ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్ దెబ్బ తీస్తున్నాడు : ఈటల రాజేందర్

by Muthe.Rajitha |

సికింద్రాబాద్‌లో నేడు జరిగిన వికసిత్ భారత్ సంకల్ప్(Vikasit Bharat Sankalp) సభలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(MP Eatala Rajendar) పాల్గొని ప్రసంగించారు.

Eatala Rajendar : తెలంగాణ ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్ దెబ్బ తీస్తున్నాడు : ఈటల రాజేందర్
X

దిశ, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్‌లో నేడు జరిగిన వికసిత్ భారత్ సంకల్ప్(Vikasit Bharat Sankalp) సభలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(MP Eatala Rajendar) పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎందరో అమరులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, ఇపుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో విఫలమవుతోందని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి కేసులపై దర్యాప్తును కాంగ్రెస్ నీరుగారుస్తోందని ఆరోపించారు.

కరోనా(Carona) మహమ్మారి ప్రపంచాన్ని వణికించినప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ధైర్యంగా నిలిచి, భారతదేశంలో కోవిద్ వ్యాక్సిన్ల తయారీని ప్రోత్సహించి, దేశాన్ని రక్షించారని అన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్‌ను అగ్రగామిగా నిలిపారని కొనియాడారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోందని... ఈ యాత్రలో భాగంగా పీఎం-కిసాన్, ఉజ్వల యోజన వంటి పథకాలు పేదలకు, రైతులకు, మహిళలకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని తెలిపిన ఈటల రాజేందర్.. ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల అవినీతి, అసమర్థ పాలనకు విసిగిపోయారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Next Story