పాశమైలారంలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్.. అధికారులకు కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-01 07:54:40  IST  )

సిగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది.

పాశమైలారంలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్.. అధికారులకు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: సిగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 36 మంది మృతి చెందినట్లు అధికారులు అధికారికంగా వెల్లడించారు. పేలుడు ధాటికి, శిథిలాల కింద పడి పలువురి మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. DNA పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లుగా కలెక్టర్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. శిథిలాల కింద మరో 27 మంది ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పాశమైలారం ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్ పరిశీలించారు. అక్కడ కొనసాగుతోన్న సహాయక చర్యల గురించి అధికారులు, జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వప్ప గాయలైన క్షతగాత్రులను కూడా పరామర్శించారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందజేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివక్ వెంకట స్వామి, దామోదర రాజనర్సింహ తదితరులు ఉన్నారు.

Next Story