- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి నేడు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. షేక్ పేట్ డిజిజన్ లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా పారా మౌంట్ కాలనీ గేట్-3 నుంచి గేట్-2, గేట్-1 మీదుగా బృందావన్ కాలనీ వరకు రోడ్ షో నిర్వహిస్తారు.

దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి నేడు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. షేక్ పేట్ డిజిజన్ లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా పారా మౌంట్ కాలనీ గేట్-3 నుంచి గేట్-2, గేట్-1 మీదుగా బృందావన్ కాలనీ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం ఎంఎస్ అకాడమీ వద్ద కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. తరవాత వెంకటగిరి వాటర్ ట్యాంకు నుంచి కృష్ణా నగర్ బీ బ్లాక్ మీదుగా యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. ఇక ఇప్పటికే సీఎం జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ప్రచారంలో గత ప్రభుత్వం పనితీరుపై విమర్శాస్త్రాలు సందిస్తున్నారు. తన స్పీచ్ తో కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు.






