హోటల్స్‌కు రేటింగ్‌పై CM రేవంత్ ఫోకస్

by Gantepaka Srikanth |

మున్సిపల్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

హోటల్స్‌కు రేటింగ్‌పై CM రేవంత్ ఫోకస్
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పలు కీలక సూచనలు చేశారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. శానిటేషన్, దోమల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మున్సిపల్ అధికారులు మార్క్ చేసిన చోటనే చెత్త వేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేసేందుకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించాలి. కోర్ అర్బన్ రీజియన్‌లో ఉన్న అన్ని స్ట్రీట్ లైట్స్‌కు ప్రత్యేక నెంబర్ ఇచ్చి డ్యాష్ బోర్డుకు కనెక్ట్ చేయాలి. టెక్నాలజీ ద్వారా సమస్య తలెత్తిన చోట వెంటనే పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకోవాలి. CURE పరిధిలో ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. హోటల్స్‌లోని కిచెన్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలి.

తరచూ తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక మానిటరింగ్ వింగ్ ఎప్పటికప్పుడు పరిశీలించేలా చర్యలు చేపట్టాలి. హోటల్స్‌కు రేటింగ్, సర్టిఫికేట్ ఇచ్చే విధానాన్ని పరిశీలించాలి. ఫైర్ సేఫ్టీ విషయంలో అడ్వాన్స్డ్ ఎక్విప్ మెంట్ వినియోగించాలి. నగరంలోని సిగ్నల్ జంక్షన్స్, సర్కిల్స్‌లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాలి. ఇందుకు ముందుగా కొన్ని ఏరియాలను గుర్తించి పైలట్ ప్రాజెక్టుగా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Next Story